తెలంగాణ

న్యాయవ్యవస్థలో కేంద్రం జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 21: ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థపై పట్టుబిగించే దిశగా కేంద్రం జోక్యం చేసుకోవటం తగదని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ఫాసిస్టు విధానాలు అవలంబిస్త్తున్న బీజేపీని గద్దె దించాల్సిందేనంటూ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసుల కేటాయింపులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కనబరుస్తున్న వివక్షతను నిరసిస్తూ, ఆయనపై పార్లమెంటులోఅభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం సబబేనని, దీనికి సీపిఐ మద్దతు ప్రకటించిందని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లోహియా మరణం వివాదాస్పదం అయినా, ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా మాత్రం సాధారణ మరణమేనంటూ ప్రకటించటం వెనుక ఆంతర్యమేంటో బహిర్గతమవుతోందన్నారు. ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై అనేక ఆరోపణలు, కేసులున్నా అవి నీరుగారి పోవటం వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్ళే కారణమని అన్నారు. జడ్జీల నియామకంలో కూడా రాజకీయ కోణం ఆవిష్కరించి, సరికొత్త దుష్ట సంప్రదాయానికి తెరలేపి, పార్లమెంటు విలువలు తగ్గిస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. దేశంలోనే మొదటిసారిగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో బీజెపి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు తీసిపోని విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఇరువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారులు తొక్కు తూ, ప్రజలను తప్పుదోవ పట్టించటం హేయమన్నారు.
థర్డ్ ఫ్రంట్ పేర మరోసారి ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడని ఎద్దేవా చేశారు. మతోన్మాద విధానాలు అడ్డుకునే క్రమంలో లౌకిక ప్రజాతంత్ర వామపక్ష విశాల వేదికను ఏర్పాటు చేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డిరాంగోపాల్‌రెడ్డి, నాయకులు అందె స్వామి, కాల్వ నర్సయ్యయాదవ్, పొనగంటి కేదారి, బూడిద సదాశివ, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కూన శోభ తదితరులు పాల్గొన్నారు.