తెలంగాణ

విలువలు కాపాడేవి దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: విలువలు కాపాడేందుకు ఆలయాలు దోహదపడతాయని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ఇస్కాన్ (హరే కృష్ణ) సంస్థ సంయుక్తంగా పునరుద్ధరించిన స్వయంభు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ప్రారంభోత్సవానికి ఉప రాష్టప్రతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ ఆలయాలు భారత సంస్కృతిలో భాగమన్నారు. సమాజంలో పోటీతత్వం పెరగడం మంచిదే అయినప్పటికీ ఆ వేగంలో విలువలు మంటగలవకుండా కాపాడేవి దేవాలయాలని అన్నారు. ఆలయం అంటే మతానికి సంబంధించింది కాదని, మానవత్వాన్ని ప్రనోధించే ప్రతి దేశమూ ఓ అలయం వంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. సదాచారం, సద్బుద్ధి ఉంటే అందరూ బాగుపడతారని ఆయన తెలిపారు. హరే కృష్ణ సంస్థ అథ్యాత్మిక విప్లవం తెస్తున్నదని ఆయన ప్రశంసించారు. మన థార్మిక సంస్కృతిని పరిరక్షించుకోవాలని, అథ్యాత్మికతను పెంచుకోవాలని అన్నారు. ‘సర్వేజనా సుఖినోభవంతు..’ అనేది హిందూ ధర్మం అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హరే కృష్ణ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరించడం పట్ల ఉప రాష్టప్రతి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలయం తమ నివాసానికి సమీపంలో ఉన్నందున నడుచుకుంటూ రావాలన్న కోరిక ఉన్నా, హోదా కారణంగా రాలేకపోయానని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు తెలిపారు.
ఇంకా ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామి, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత్ దాస, శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ కె. స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఎంపీ కె. కేశవరావు, ఎపి-తెలంగాణ హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస పాల్గొన్నారు.

చిత్రం..బంజారా హిల్స్‌లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించిన
ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు