తెలంగాణ

మీ మధ్యే సఖ్యత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ‘మీ రెండు (సీపీఐ-సీపీఎం) పార్టీల మధ్యే సఖ్యత లేనప్పుడు దేశంలోని వామపక్ష, రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమా?’ అని బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సీపీఎం నేతలపై విరుచుకుపడ్డారు. సీపీఎం మహా సభల్లో ఆ పార్టీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయని దత్తాత్రేయ ఆదివారం పార్టీ నాయకుడు ప్రకాశ్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, సుధాకర శర్మ, చింతా సాంబమూర్తితో కలిసి విలేఖరుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్‌తో జత కట్టాలని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సీపీఎం తీర్మానించి, ఆ పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని ఆయన తెలిపారు. అయితే ఆ మర్నాడే సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో దోస్తీ ఉండదని చెప్పారని అన్నారు. దీనిలో ఏదీ నిజం అని దత్తాత్రేయ ప్రశ్నించారు. పైగా ఒక లోక్‌సభ (ఖమ్మం) సీటులోనే సీపీఐ, సీపీఎంలు సఖ్యత లేకుండా పోటీ చేస్తుంటాయని ఆయన ఉదహరించారు. అటువంటిది దేశంలోని వామపక్షాల, రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసి బీజేపీని గద్దె దించడం సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు.
2019లో పులి వస్తుంది..
వచ్చే ఎన్నికల్లో పులి (బీజేపీ) వస్తుందని దత్తాత్రేయ అన్నారు. ఆ పులి ఎవరో ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి ఆట కట్టించేందుకు, 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష, మరణ శిక్ష విధించేలా చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్‌లు తీసుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణలో గడప దాటడం లేదని ఆయన విమర్శించారు.
చిత్రం..నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న బండారు దత్తాత్రేయ