తెలంగాణ

సమర్థ నీటి యాజమాన్యంతో పెరిగిన పంటల ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమర్థ నీటి యాజమాన్యంతో సాగుభూమి విస్తీర్ణం పెరగడంతో పాటు పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఒక టీఎంసీ నీటితో గతంలో 6000 ఎకరాల వరకు నీటిని అందివ్వగా, గత నాలుగేళ్ల నుండి సమర్థవంతమైన నీటియాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల 11,000 నుండి 11,500 ఎకరాల వరకు సాగునీటిని అందివ్వగలుగుతున్నారు. నీటి యాజమాన్యం ఆధునిక విధానాలతో ఉండటంతో పంటల ఉత్పత్తి కూడా పెరిగింది. యాసంగింలో 57 లక్షల టన్నుల వరిధాన్యం, 68 లక్షల టన్నుల మక్క (మొక్కజొన్న) దిగుబడి వస్తుందని అంచనావేశారు. పంటల ఉత్పత్తి పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా మారుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్, ఘన్‌పూర్ ఆనికట్ తదితర ప్రాజెక్టుల కింద నీటిని ఆధునిక విధానాల్లో భూములకు అందిస్తున్నారు. నీటిపారుదల మంత్రి హరీష్‌రావు నిరంతరం సాగునీటి ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షించడంతో అధికారులు జాగ్రత్తగా పనిచేస్తుండటంతో 2017-18 యాసంగిలో పంటల విస్తీర్ణం పెరిగింది. నీటిపారుదల సిబ్బందితో పాటు రైతులకు నిర్వహిస్తున్న అవగాహన శిబిరాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో (పాత జిల్లాల పరిధి) ఆధునిక విధానాల్లో జరుగుతున్న సేద్యం వల్ల వరిధాన్యం ఎకరాకు 40 నుండి 50 బస్తాల వరకు ఉత్పత్తి అవుతోంది. నాగార్జునసాగర్ కాలువలను ఆధునీకరించడంతో ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందుతోంది.
మధిర, బోనకల్ ప్రాంతాల్లో ఆయకట్టు చివరి భూములకు తొలిసారి సాగునీటిని అందించడం ప్రశంసనీయమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఖమ్మంలో 2.50 లక్షల ఎకరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలు సాగవుతోంది. నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టామని, ఈ పనుల్లో 98 శాతం పూర్తయ్యాయని కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్ తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 2013-14 లో 72 టీఎంసీల నీటితో 4.37 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా, 2014-15 లో 51.04 టీఎంసీలతో 2.76 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 2016-17 యాసంగిలో 36 టీఎంసీల నీటితో 3.83 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా, 2017-18 లో 44.78 టీఎంసీల నీటితో 5.20 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 2017-18 యాసంగిలో ఒక టీఎంసీ నీటితో 11,613 ఎకరాలను సాగు చేస్తున్నారు. సాగునీటి పంపిణీలో ఆన్ అండ్ ఆఫ్ విధానంలో తొమ్మిదిరోజులపాటు నీటిని విడుదల చేస్తూ, ఆరురోజుల పాటు నిలిపి వేసే వారబందీ విధానాన్ని అమలు చేయడం సత్ఫలితాలను ఇస్తోంది.