హైదరాబాద్

మంత్రి కేటీఆర్ ఔదార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె టి రామారావు తన మంచి మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా మంత్రి కె టి రామారావు ముందు వరుసలో ఉంటారు. దయనీయ పరిస్థితుల్లో ఉన్న అభ్యుదయ కవి, కథా రచయిత చైతన్య ప్రకాష్‌కు అండగా నిలిచారు. ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాష్ గత 25 ఏళ్లుగా సామాజిక చైతన్యం, వామపక్ష భావజాలంతో కథలు రాస్తున్నారు. ఆయన ఇటీవల పక్షవాతానికి గురయ్యారు. కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. దీర్ఘకాలం మందులు వాడాలని డాక్టర్లు సూచించారు. సిరిసిల్లలో మిత్రుడు ఇచ్చిన రేకుల షెడ్డులో చిల్లిగవ్వ లేకుండా, సొంతంగా కాలకృత్యాలు తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న చైతన్య ప్రకాశ్‌ను సాహితీ మిత్రులు పరామర్శించారు. ఈ విషయం మంత్రి కెటి రామారావు దృష్టికి వచ్చింది. వెంటనే మంత్రి కార్యాలయం చైతన్య ప్రకాశ్‌తో మాట్లాడి చికిత్సకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు రూ.3 లక్షల ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని మంత్రి రామారావు మంజూరు చేశారు. ఈ నెల 23వ తేదీన ఈ సహాయం చైతన్య ప్రకాశ్‌కు అందుతుంది. తన కుమారుడి ఆరోగ్య పరిరక్షణకు మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ పట్ల తల్లి ఎల్లమ్మ కృతజ్ఞతలు తెలిపింది. కష్టాల్లో ఉన్న సాహితీ కళాకారుని ఆదుకున్న మంత్రి చొరవకు సాహితీ లోకం ధన్యవాదాలు తెలిపింది.