తెలంగాణ

బాలకృష్ణ తప్పేమన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలని కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకే ధర్మ పోరాట దీక్ష చేశారని టీ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ సభలో ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన ప్రసంగాన్ని బీజేపీ నాయకులు తప్పు పట్టడంలో అర్ధం లేదని రావుల ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా బాలకృష్ణ ప్రసంగించారే తప్ప పరుష పదాలు మాట్లాడలేదని రావుల ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చి చంపాలని, బావిలో దూకాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. 1999 ఎన్నికల్లో కూడా బీజేపీ తమ పార్టీతో కలిసి పోటీ చేసిందని, ఈ చరిత్రను బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి మరిచిపోతే ఎలా? అని రావుల ప్రశ్నించారు. చంద్రబాబు ఎక్కడా మాట జారలేదని అన్నారు. దీనికి భిన్నింగా బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని ఆయన తెలిపారు.
పుట్టగతులుండవు: సాయిబాబా
టీ.టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం నాయకుడు సాయిబాబా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.