తెలంగాణ

మిల్లర్లూ... తప్పులు చేయకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్రంలోని రైస్‌మిల్లర్లు అక్రమాలకు, తప్పుడు పనులకు పాల్పడవద్దని పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన రైస్‌మిల్లర్ల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మిల్లర్లు బాగా పనిచేసి, నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉంటూ మంచిపేరు తెచ్చుకోవాలని, అలాగే ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని కోరారు. మిల్లర్ల ప్రయోజనం కోసం మిల్లింగ్ చార్జీలను పెంచామని తెలిపారు. మిల్లర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని గుర్తు చేశారు. మిల్లింగ్ పరిశ్రమను కాపాడతామని హామీ ఇచ్చారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు 2014 కంటే ముందు 150 కోట్ల రూపాయలుగా ఉండేవని, ఇందులో కొంత భాగం వసూలు చేశామని, మరికొంత భాగం వసూలు చేయాల్సి ఉందన్నారు. సీఎంఆర్ బియ్యం ఇచ్చే విషయంలో మిల్లు సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాత గోనె సంచులను వాడవద్దని, వాటి స్థానంలో కొత్తవి సరఫరా చేస్తామన్నారు. ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉండాలంటూ పౌరసరఫరాల కమిషనర్ సునీల్ శర్మను ఆదేశించారు.
వరిధాన్యం ధర గ్రేడ్-1 క్వింటాల్‌కు 1590 రూపాయలు, గ్రేడ్-2 క్వింటాల్‌కు 1550 రూపాయలు ఉండగా, మరో 30 రూపాయలు అదనంగా ప్రభుత్వం కలిపి రైతులకు అందిస్తున్నామన్నారు. అంటే గ్రేడ్-1 వరిధాన్యానికి క్వింటాల్‌కు 1620 రూపాయలు, గ్రేడ్-2 ధాన్యానికి 1580 రూపాయలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. యాసంగి (రబీ) లో 35.50 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 3 లక్షల టన్ను ధాన్యం సేకరించామని మంత్రి ఈటెల తెలిపారు.

చిత్రం..రైస్ మిల్లర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్