తెలంగాణ

తెలంగాణ ఇంటి పార్టీలో ‘అలజడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టిజెఎస్)లో తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేసే విషయంలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ప్రొఫెసర్ కోదండరామ్ పట్టించుకోవడం లేదని, పిల్ల జమీందార్ వ్యవహరిస్తున్నారని కొందరు అంటే, లోగడ తెలంగాణ ఉద్యమం సమయంలో కలిసి పోరాటాలు చేసినట్లే ఇప్పుడూ టిఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు ఏకం కావాల్సిన అవశ్యకత ఉందని మరి కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. టిజెఎస్‌లో తమ పార్టీని విలీనం చేయడం వల్ల అస్థిత్వం కోల్పోతామన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. తమ పార్టీని టిజెఎస్‌లో విలీనం చేస్తే బలహీన వర్గానికి చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్‌ను కోరగా, ఆయన తిరస్కరించారన్న విషయాన్నీ మరి కొంత మంది ప్రస్తావించారు. టి.జెఎసిని టిజెసిగా మార్చేసి టి.జెఎసికి అస్థిత్వం లేకుండా చేశారని కొందరు ప్రొఫెసర్ కోదండరామ్‌ను విమర్శించారు. చివరకు విలీనంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోసారి చర్చిద్దాం అంటూ సమావేశాన్ని వాయిదా వేశారు.