తెలంగాణ

కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఏజెంట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారారని బిజెపి నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ పట్ల సిపిఎం నేతల వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, ఎమ్మెల్యే సి. రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ డిమాండ్ చేశారు. సిపిఎం మహా సభల్లో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని, బిజెపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ఏమి చేయాలన్న ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు. అవినీతి, అక్రమాలకు పుట్టినిల్లు అయిన కాంగ్రెస్‌తో కలిసి సాగాలని సిపిఎం నిర్ణయించిందన్నారు. లోగడ కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నింటిలోనూ సిపిఎం కూడా భాగస్వామ్యమేనని ఆయన విమర్శించారు. బిజెపిని కౌరవులతో పోలుస్తూ తమకు తాము పాండవులమని చెప్పుకున్నారని ఆయన తెలిపారు. నాస్తికులైన సిపిఎం నాయకులు పాండవులతో పోల్చుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, తమను కౌరవులతో పోల్చడాన్ని ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. అస్థిత్వం కోసం సిపిఎం ఆరాటపడుతున్నదని ఆయన విమర్శించారు. బిజెపిని విమర్శిస్తే దేశ ప్రజలను విమర్శించినట్లే అవుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు ఏజెంట్లుగా మారారని విమర్శించారు. ఇప్పటికే త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు తిరస్కరించారని, కేరళలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు తిరస్కరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.