తెలంగాణ

ఏదీ ధార్మిక పరిషత్?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: దేవాలయాల పరిపాలనకు సంబంధించి ‘్ధర్మిక పరిషత్’ ఏర్పాటులో తీవ్రమైన జాప్యం జరుగుతోందన్న భావన హిందూ సమాజంలో కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు కావస్తోంది. ఈ నాలుగేళ్లలో చట్టప్రకారం ఏర్పాటు కావలసిన సంస్థల్లో ధార్మిక పరిషత్ మినహా దాదాపుగా అన్ని సంస్థలూ ఏర్పాటయ్యాయి. దేవాదాయ, ధర్మాదాయ చట్టం 33/2007 (హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్) ప్రకారం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకు దేవాలయాలన్నా, హిందూ ధర్మమన్నా ప్రత్యేక గౌరవం, అభిమానం ఉందన్న భావన జనంలో కనిపిస్తోంది. భద్రాద్రి, యాదాద్రి, ఏములాడ (వేములవాడ), బాసర, ధర్మపురి తదితర దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వ ఖజానానుండి నిధులు కేటాయించి, హిందూ ఆలయాలపై ఉన్న భక్తిని చాటుకున్నారన్న భావన జనంలో కలిగింది. తెరాస అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో ధార్మిక పరిషత్ గురించి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి అనేక పర్యాయాలు ప్రస్తావించారు. త్వరలోనే ధార్మిక పరిషత్ ఏర్పాటవుతుందని ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఒక ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తున్నట్టు సంబంధిత అధికారులు చాలాసార్లు వెల్లడించారు.
దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే ధార్మిక పరిషత్‌లో 20 మంది సభ్యులతో పాటు మరో ఏడు నుండి 10 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చు. సభ్యుల్లో అధికారులతో పాటు అనధికారులు ఉంటారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండగా దేవాదాయ, ధర్మాదాయ చట్టం 1987 లో మార్పులు చేశారు. ఈ మార్పులు, చేర్పుల తర్వాత 33/2007 అమల్లోకి వచ్చింది. కొత్త చట్టంలో ముఖ్యమైంది ధార్మిక పరిషత్ ఏర్పాటు. దేవాదాయ ధర్మాదాయ చట్టం 152 ప్రకారం ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ చట్టానికి అనుగుణంగా 2009 లో ఒక సారి 2014లో మరోసారి ధార్మిక పరిషత్తు ఏర్పాటయ్యాయి. ఒక సారి ఏర్పాటైన ధార్మిక పరిషత్ సభ్యుల (అనధికారిక సభ్యులు) కాలపరిమితి మూడేళ్లుగా ఉంటుంది. ధార్మిక పరిషత్‌లో నలుగురు ఉన్నతాధికారిక సభ్యులుగా ఉంటారు. వీరితో ఎగ్జిక్యూటివ్ బాడీ ఏర్పాటవుతుంది. అధికారిక సభ్యులతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులను (అనధికార సభ్యులు) సభ్యులుగా నియమిస్తారు. దేవాలయాల పరిపాలతో పాటు ఎండోమెంట్స్ పరిపాలనకు సంబంధించి పరిషత్తు కీలకంగా ఉంటుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండటం వల్ల ఆలయాల అభివృద్ది, అర్చకులు, ఉద్యోగుల సంక్షేమం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నది ముఖ్యమైన ఆలోచన.
హిందూ దేవాలయాలపై పెత్తనం చూపిస్తున్న ప్రభుత్వం ఇతర మతాల ప్రార్థనామందిరాలపై ఎందుకు జోక్యం చేసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ధార్మిక పరిషత్ అవసరం ఎంతైనా ఉంటుంది. ధార్మిక పరిషత్ ఏర్పాటైతే ఆలయాల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై అనధికారులతో కూడిన ధార్మిక పరిషత్తు నిర్ణయాలే కీలకంగా ఉంటాయి. అంటే హిందూ దేవాలయాలపై ప్రభుత్వం జోక్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.