తెలంగాణ

పంట నష్టపరిహారం తక్షణం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని పొన్నాల సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఇంత వరకు నష్టం వాటిల్లిన పంటలపై ప్రభుత్వం సమాచారం లేదన్నారు. రుణ మాఫీ బకాయిలను చెల్లించలేదని ఆయన విమర్శించారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు ఎందుకు వర్తింపజేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల్లో బీమా కింద ఒక్క రైతుకైనా నష్టపరిహారం చెల్లించారా? అని ఆయన ప్రశ్నించారు. పిడుగుపాటుతో రైతులు మరణించారని ఆయన తెలిపారు. రైతుల ఓపికను పరీక్షించవద్దాన్నారు. వచ్చే ఎన్నికల్లో రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలూ టిఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పనున్నారని ఆయన హెచ్చరించారు. ఓట్ల కోసం రైతుల గురించి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నాలుగు సంవత్సరాలుగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏనాడూ ముఖ్యమంత్రి స్పందించలేదని పొన్నాల అన్నారు. రైతులకు లబ్ది చేకూరే పథకాలన్నీ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినవేనని ఆయన తెలిపారు. పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.