తెలంగాణ

26నుంచి సీపీఐ జాతీయ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: భారత కమ్యూనిస్టు పార్టీ 23వ జాతీయ మహాసభలను ఈనెల 26 నుంచి 29వరకు కేరళలోని కొల్లాం జిల్లా కేంద్రంలో కొనసాగనున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయం మగ్దూం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 26న ఉదయం ప్రతినిధుల మహాసభను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, పార్టీ నిర్మాణం, రాజకీయ తీర్మానంపై చర్చ, హిందూ ఫాసిస్టుల మతోన్మాదం, ఆర్ ఎస్స్, సంఘ్ పరివార్ దాడులు, కేరళ, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో వామపక్ష కార్యకర్తలపై దాడులు, కార్యాలయాల ధ్వంసం, దళిత, మైనారిటీల దాడులు, ఉన్నావ, కధువా ఘటనలు వంటి అంశాలపై మహాసభల్లో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యచరణ ఖరారు చేయనున్నట్టు తెలిపారు. నాలుగు రోజుల పాటు సాగే మహాసభలకు దేశవ్యాప్తంగా సుమారు 750 మంది ప్రతినిధులు పాల్గొంటారని అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే 91 మంది ఉంటారని తెలిపారు.