తెలంగాణ

రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, ఏప్రిల్ 23: నీళ్లు, నిధులు, నియామకాల కోసం అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు, పేద ప్రజలు, అన్ని వర్గాల ప్రజల అభివృది,్ధ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామం నుండి బొమ్మలమ్మగుట్ట, న్యాలకొండపల్లి మోడల్ స్కూల్ వరకు 2.77 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గంగాధర చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మండలంలోని 600 మందికి డప్పులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి గంగాధర చౌరస్తాలో గల విఎఎస్ ఫంక్షన్ హాలు వరకు డప్పులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలలో వివక్ష చూపించారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరు గంటల విద్యుత్ కూడా సరఫరా ఉండదని ఆనాడు చెప్పారని, తెలంగాణ రాష్ట్రంలో నేడు రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు పరిశ్రమలు, గృహావసరాలు, రెప్పపాటు కరెంట్ పోకుండా అందిస్తున్నామని ఆయన అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పైరవీలతో ప్రజాధనాన్ని దోచుకోగా నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో పేదరికంలో ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వెయ్యి నుండి 1500 పింఛన్ అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల చేపడుతూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు కేసులు వేస్తూ కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 35లక్షల మంది రైతాంగానికి 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, ఇప్పటి కేంద్రప్రభుత్వం సహకరించుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే రుణాలు మాఫీ చేసిందన్నారు. జగిత్యాల నుండి వరంగల్ వరకు జరుగుతున్న ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పనులను ఇరువైపులా సమానంగా భూ సేకరణ చేపట్టేలా చూస్తామన్నారు. అలాగే వరద కాలువలో రైతు మోటార్లు ఏర్పాటు చేసుకొని పంటలు సాగు చేసుకోవడంతో పాటు వరద కాలువకు అవసరమున్నచోట తూముల నిర్మాణం చేపడుతామన్నారు. వచ్చే దసరా వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందిస్తామని ఆయన అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఎమ్మెల్యే బొడిగ శోభ పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితం తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, తెలంగాణ వెనుకబాటుతనంపై కేసీఆర్ నాయకత్వంలో గులాబి జెండాపార్టీ ఏర్పడిందన్నారు. ప్రజలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అనేక ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు నేడు అనేక చెరువులు నిండి మత్తడులు దూకుతున్నాయని ఆయన అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. వచ్చే రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం నిధులు, విద్యుత్ సాధించి ఇతర రాష్ట్రాలకు ఇచ్చే విధంగా రాష్ట్రం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని అందు కు ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్ష, పట్టుదలే కారణ మన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొడిగ శోభ, ఎంపీపీలు బాలాగౌడ్, భూం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాపురెడ్డి, పార్టీ జిల్లా, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్రం..గంగాధరలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్