తెలంగాణ

4న ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మే 4వ తేదీన ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలను ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో పనిచేస్తు న్న ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు, జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు, బీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రియంబర్స్‌మెంట్, ఇళ్ల స్థలాలు, పెన్షన్ తదితర అంశాలపై ఈ మహాసభలో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. సభలకు ముఖ్య అతిధులుగా మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్న, ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణ తదితరులు హాజరు అవుతారని పేర్కొన్నారు.