తెలంగాణ

కమ్యూనిస్టులపై ఆరోపణలు మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ బీజేపీ నాయకులకు హితవుపలికారు. మంగళవా రం సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వంలో జరిగిన స్కాముల్లో కమ్యూనిస్టులకు భాగస్వామ్యం ఉందని తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కుంభకోణాల్లో భాగమైతే అత్యున్నత సంస్థలచే విచారణ జరిపి శిక్షించాలని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి మయం అయిందని ప్రచారం చేసిన మోడి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు. దేశంలో కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడ్డవారు దర్జాగా తిరుగుతున్నారని, లక్షల కోట్ల 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంతో సంబంధం ఉన్న రాజా, కనిమొలి జైలుకు వెళ్లి బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారని విమర్శించారు. జైల్లో ఉండాల్సిన గాలి జనార్ధన్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ కుంభకోణంలో ఉన్న యడ్యూరప్పను కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం అంటేనే అవినీతి పెంచి పోషించడమేనని అన్నారు. దేశంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి కొమ్ముకాస్తున్న బీజేపీ నాయకులు కమ్యూనిస్టులను విమర్శించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ముఖ్యమంత్రులు భరత్ అనే నేను సినిమా చూసి బుద్దితెచ్చుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.