తెలంగాణ

బీసీల సమగ్ర అధ్యయనానికి ఏక సభ్య కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాల వాస్తవ జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 4 ఏక సభ్య కమిటీలను ఏర్పాటు చేసినట్టు బీసీ కమిషనర్ చైర్మన్ రాములు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి, వారి నివాస ప్రాంతాలను, సామాజిక, జీవన స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలిస్తాయని చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన జీ ఓ 9 ప్రకారం నియమ నిబందనలకు లోబడి ఏక సభ్య కమిటీలు తమ అధ్యయనాలను కొనసాగిస్తాయని తెలిపారు. కమిషన్ చైర్మన్ బీఎస్ రాములతో పాటు వకుళాభరణం కృష్ణమోహన్, అంజనేయ గౌడ్, జూలూరి గౌరీశంకర్‌లు ఏక సభ్య కమిటీలకు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఒక్కొక్కరు పది జిల్లాల చొప్పున పర్యటించి సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందించనుంది.