తెలంగాణ

29న ఢిల్లీలో అక్రోష్ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామి విధానాలు, నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీలో ‘అక్రోశ్’ పేరిట కాంగ్రెస్ పార్టీ ఈ నెల 29న పెద్ద ఎత్తున ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహింనున్నది. ఎఐసిసి అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చేపట్టిన కార్యక్రమం కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలతో కదిలి వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్, కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపడుతున్న మొదటి కార్యక్రమం కాబట్టి అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.

చిత్రం..గాంధీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీటింగ్‌లో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్, పొన్నాల, దానం