తెలంగాణ

ముగ్గురు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ / కరీంనగర్ / వరంగల్, నవంబర్ 27: పంటల కోసం చేసిన అప్పలు తీర్చలేక.. ఒత్తిడులు తట్టుకోలేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. శుక్రవారం రాష్ట్రంలో అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు తెగబడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామానికి చెందిన గన్నమోని అంజమ్మ (55) అనే మహిళా రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకొంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారానికి చెందిన ఎరకట్ల సమ్మయ్య (35) అనే పురుగుల మందు తాగి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్యాల రఘుపతిరెడ్డి (55) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.
రాష్ట్ర విభజన
రాజ్యాంగ విరుద్ధం
రాష్టప్రతికి మాజీ ఎంపి ఉండవల్లి లేఖ
రాజమండ్రి, నవంబర్ 27: రాష్టవ్రిభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్టవ్రిభజనలో జరిగిన అవకతవకలను సరిదిద్ది, తగిన న్యాయం చేయాలని ఆయన శుక్రవారం రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి రాసిన లేఖలో కోరారు. రాష్టవ్రిభజన ప్రక్రియ గందరగోళం మధ్య జరిగిందని మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎఐసిసి నేత దిగ్విజయ్‌సింగ్ కూడా పలు సందర్భాల్లో పేర్కొన్నారన్నారు. జాతీయస్థాయి పార్టీలు మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణా సాకారమైందని జైపాల్‌రెడ్డి చెప్పారని వెల్లడించారు. 2014 ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12గంటలకు పార్లమెంటు సమావేశం వాయిదాపడిందని, దీంతో తెలంగాణా సాధ్యం కాదని ఆందోళన చెందామని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారన్నారు. ఆ రోజు సభ సక్రమంగా జరగలేదని కూడా జైపాల్‌రెడ్డి చెప్పారన్నారు. దీంతో తాను, మాజీ టి ఎంపి పొన్నం ప్రభాకర్ తదితరులు స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి మంతనాలు సాగించామని, ఆ వివరాలు వెల్లడించలేనని జైపాల్‌రెడ్డి చెప్పారని ఉండవల్లి తన లేఖలో వెల్లడించారు.
అలాగే అప్పటి బిజెపికి చెందిన విపక్షనేత సుష్మాస్వరాజ్‌ను కాళ్లుపట్టుకుని పార్లమెంటుకు రప్పించామని, ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు సీమాంధ్ర ఎంపిలు ప్రతిఘటించినా 100 మంది కాంగ్రెస్ ఎంపిలు బలంగా నిలబడి బిల్లును ఆమోదించుకున్నామని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారని తెలిపారు. ఈమేరకు జైపాల్‌రెడ్డి విలేఖర్ల సమావేశంలో మాట్లాడిన అంశాలను, దిగ్విజయ్‌సింగ్ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మాట్లాడిన అంశాలను తెలుగు, హిందీ, ఇంగ్లీషు అనువాదాల కాపీలను లేఖతో పాటు రాష్టప్రతికి పంపారు.