తెలంగాణ

ఎండలు ముదిరినా ..విద్యుత్‌కు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఎండలు ముదురుతున్నా, కొన్ని పట్టణాల్లో 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా, ఎక్కడ రెప్పపాటు కూడా కరెంటు పోవ డం లేదు. రబీ సీజన్ ముగియడంతో రాష్ట్ర విద్యుత్ శాఖ ఊరట చెందింది. ఊహించిన దానికంటే ముందుగానే ఏప్రిల్ నెలలోనే ఎండలు మండుతున్నా యి. మార్చి నెల 8వ తేదీన 10284 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చింది. ఏప్రి ల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ 11 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం వల్ల గరిష్ట స్థాయిలో విద్యుత్ వినిమయం జరిగింది. రబీ సీజ న్ (యాసంగి) దాదాపుముగిసినట్లే. దీం తో గృహ, పరిశ్రమల రంగానికి విద్యుత్ సరఫరాలో ఎండాకాలంలో కూడా ఎటువంటి ఆవరోధాలు ఉండవని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రా ష్ట్రంలో 8వేల మెగావాట్ల విద్యుత్ డిమాం డ్ నమోదైంది. ఇందులో జెన్కో థర్మల్ నుంచి 58.055 ఎంయూ, సింగరేణి నుంచి 27.524 ఎంయు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 20.951 ఎంయు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇతర విభాగాల నుంచి 64.077 ఎంయు కలిపి దాదాపు 171.735 ఎంయును తెలంగాణ ట్రాన్స్‌కో సమకూర్చుతోంది. ఇదే విధం గా ఎండలు ముదిరితే మరో వెయ్యి మె గావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా. ఇప్పటికే ముందస్తుగా విద్యుత్ కొనుగోలుపై ఒప్పందాలు అమలులో ఉండడం వల్ల మే నెల లో కూడా విద్యుత్ సరఫరాకు ఎటువం టి ఢోకా ఉండదని విద్యుత్ వర్గాలు తెలిపాయి. 24 గంటల వ్యవసాయ విద్యుత్ వల్ల రాష్ట్రంలో 7.41 లక్షల హెక్టార్లలో వ రి పంటను రైతులు వేశారు. వరి ధాన్యం కోతలు దాదాపు ముగింపునకు వచ్చా యి. గత 21 రోజుల్లో విద్యుత్ డిమాండ్ 10వేల మెగావాట్ల నుంచి 8 వేల మెగావాట్లకు తగ్గింది. కాగా గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో విద్యుత్ డిమాండ్ 2800 మెగావాట్లకు చేరింది. రాష్ట్రంలో మూడో వంతు విద్యుత్ వినిమయం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇంతకంటే ఎక్కువగా డిమాండ్ వచ్చినా తట్టుకునేందుకు వీలుగా సదరన్ పవర్ డిస్కాం అధికారులు విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారు.