తెలంగాణ

పాత పెన్షన్ అమలు చేసేవారికే ఉద్యోగుల ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: పాత పెన్షన్ విధానాన్ని అమ లు చేస్తామని హామీ ఇచ్చే పా ర్టీలకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అ ని ‘జన జాతర’ సభలో చేసిన తీర్మానాన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి అం దజేసారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ‘జన జాతర’ తీర్మానాల ప్ర తులను తెలంగాణ రాష్ట్ర కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయాస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషికి అందజేసారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలుపాలని వారు విజ్ఞప్తి చేసారు. తమిళనాడులో కొత్త పెన్షన్ విధానం రద్దు కోసం శాంత శిలా నాయర్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిఎస్‌కు వివరించారు. అదే విధంగా కర్నాటక ఎన్నికల్లో కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వారు గుర్తు చేసారు.