తెలంగాణ

ఆరు నెలల్లో ఎయిమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆరు నెలల్లో ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళుతున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మం త్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఫివర్ ఆసుపత్రి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంసీ బ్లాక్, మెడిసిన్ డిస్పెన్సరీ, లైబ్రరీ భవనం, ఆడిటోరియాన్ని కేంద్ర మా జీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను గతంలో ఎ న్నడూ లేని విధంగా ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. వ్యా ధుల నిర్థారణ, అనంతరం మెరుగైన వైద్య చికిత్సల కో సం అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 20 ఐసీయూ సెంటర్లు, 40 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశామని వివరించారు. రాష్ట్రం లో వైద్యం అందక ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దీనిలో భాగంగా ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందు కు ప్రణాళికలను సిద్దం చేశామని పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఫీవర్ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, నల్లకుంట కా ర్పొరేటర్ గరికంటి శ్రీదేవి, డీఎంఈ రమేష్ రెడ్డి, ఫివర్ హాస్పిటల్ సూపిరింటెండెంట్ శంకర్ పాల్గొన్నారు.

చిత్రం..నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ఏఎంసీ బ్లాక్, మెడిసిన్ డిస్పెన్సరీ, లైబ్రరీ భవనం, ఆడిటోరియాన్ని
ప్రారంభిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి