తెలంగాణ

తెలంగాణలో మహిళలకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్రం ఐటి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అంతర్జాతీయ స్థాయిలో అన్ని కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాల ఏర్పాటుకు పోటీపడుతున్నాయని ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనికి మంచి పోటీ ఉన్నట్లు చెప్పారు. బుధవారం ఇక్కడ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంక్యుబేటర్‌లో స్థానం కోసం 250 దరఖాస్తులు వచ్చాయన్నారు. కాని వంద నుంచి 125 మందికి మాత్రమే స్థానం కల్పించగలమన్నారు. రాష్ట్రప్రభుత్వం అనేక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని త్వరలోనే మరో ఇంక్యుబేటర్‌ను నెలకొల్పుతామని ఆయన హామీ ఇచ్చారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, యుంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సభ్యులు తెలంగాణ పారిశ్రామిక, ఐటి విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఐటివిధానాలకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోందన్నారు. ఎఫ్‌ఎల్‌ఒ జాతీయాధ్యక్షుడురాలు పింకీ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆశయాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, ఐటి అభివృద్ధికి పాటుపడుతామన్నారు. ఎఫ్‌ఎల్‌ఒ హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్‌గకా ప్రియాంక గనిర్వాల్ అరోరా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోరా మాట్లాడుతూ మహిళల్లో స్వావలంభన సాధికారత సాధించేందుకు తాను కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చామని, వీరికి ఇంకా సెక్యూరిటీ, ఇతర వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం వల్ల ప్రతిభకు గుర్తింపు ఇచ్చినట్లయిందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
సెంట్రల్ మ్యాట్రెసస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా
సెంట్రల్ మ్యాట్రెసస్ సంస్థ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను నియమించినట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ తెలిపారు. సిగ్నెచర్ కలెక్షన్ పేరిట అత్యున్నతమైన డీలెక్స్ ఉత్పత్తులను తమ సంస్థ ప్రారంభించిందన్నారు. ఎండ్యురెన్స్ ప్రొ,బాక్ స్పోర్ట్, పిక్సెల్, టర్బో స్లీప్ పేరిట నాలుగు ఉత్పత్తులను ప్రారంభించామన్నారు.
చిత్రం..ఫిక్కీ అనుబంధ సంస్థ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్తలు