తెలంగాణ

పర్యావరణ పరిరక్షణపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మే 19: పర్యావరణ పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దృష్టి సారిస్తుండగా, మానవ మనుగడ, పశు, వన్యప్రాణుల మనుగడకు వాతావరణ సమతుల్యత ఎంతో అవసరమని ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రతినిధి అతుల్‌బగాయ్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ పరిదిలోని మినాజిపేట, సింగాయపల్లి, కోమటిబండ అటవీ ప్రాంతాలను సందర్శించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. చక్కటి వాతావరణంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడనుండగా, భూ, వాయు, జల కాలుష్య నిర్మూలణకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో చైతన్యం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా అటవీ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అయితే లక్ష్య సాధనలో ఉత్తమ ఫలితాలు సాధించి అటవీ అభివృద్ధి పనులు అత్యంత నాణ్యతతో, పర్యావరణ పరంగా మంచి ఫలితాలతో జాతీయ స్థాయిలోనే ముందున్నట్లుగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. చెట్లు పెంచడంతోనే మానవుడికి అవసరమయ్యే ఆక్సిజన్ ఉత్పత్తి అవడంతోపాటు వర్షాలు సమృద్ధిగా కురవడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, అటవీ అభివృద్ధి సంస్థ సీసీఎఫ్ పీకేఝా, అటవీ అదనపు పీసీసీఎఫ్ రాకేశ్‌మోహన్ డోబ్రియాల్, కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, జిల్లా అటవీ అధికారి శ్రీదర్ రావు, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, రేంజ్ అటవీ అధికారి వెంకట్‌రామారావులు పాల్గొన్నారు.