తెలంగాణ

కన్నడ రాజకీయం బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 19: కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయాలు బాధాకరమని, ఇవి దేశానికి మంచిదికాదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఏ పార్టీలో గెలిచిన వారు ఏ పార్టీలోకి వెళుతున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని, ఆ పరిస్థితులు తెలంగాణలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న రోత (గలీజు) రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు, రాజకీయ ప్రక్షాళన కోసమే టీజేఎస్ ఆవిర్భవించిందని అన్నారు. శనివారం కరీంనగర్ శివారులోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాలులో టీజేఎస్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య కార్యకర్తలకు రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఇరిగేషన్, వ్యవసాయం, మహిళా సాధికారత, రాజకీయాలు, విద్యారంగం తదితర అంశాలపై ఆయా రంగాల నిపుణులు ప్రసంగించారు. అలాగే పార్టీ బలోపేతంపై సమిష్టి నిర్ణయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆ నలుగురు ఓ నలుగురి కోసం పాలన కొనసాగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. సంపన్నుల అభివృద్ధి కోసమే రైతుబంధు పథకం అమలు చేస్తున్నదని, చిన్న, సన్నకారు రైతులకు ఆ పథకంతో లాభం ఒనగూరేదేమిలేదని అన్నారు. ప్రాజెక్టులు, కరెంట్ కొనుగోళ్ల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు, భూప్రక్షాళనలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం