తెలంగాణ

కమీషన్ల కోసమే రీడిజైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 19: అవినీతిలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టం చేశారని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడే రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్లు, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. మూడవ విడిత ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. హామీలు నెరవేర్చని టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని 2019 ఎన్నికలలో ప్రజలు బొందపెట్టాడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా రహుల్‌గాంధీ కావడం ఖాయం అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో డ్వాక్రా మహిళ సంఘాలను, మహిళాగ్రూపులను నిర్వీర్యం చేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న 6లక్షల మహిళా సంఘాలకు లక్ష రూపాయల చొప్పున గ్రాంట్ ఇస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి మహిళ సంఘానికి బ్యాంక్ నుండి 10లక్షల రుణా సౌకర్యం కల్పించి వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరించి వేయి రూపాయల పింఛన్ అందజేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యాక ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో రైతులను మభ్య పెట్టడానికే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, అయితే తాము రైతుబంధు పథకానికి వ్యతిరేకం కాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వ్యవసాయ పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి 15వందల చొప్పున బోనస్ అందజేస్తామని అన్నారు. కర్నాటకలో, ఆంధ్ర ప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తున్న తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాము అధికారంలో వచ్చిన వెంటనే మిర్చి, పసుపుకు 10వేలకు తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తామని, వరి, మక్క, సజ్జలకు బోనస్ అందజేస్తామని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుబట్టివిక్రమార్క, ఏఐసీసీ జాతీయ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క, నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి, పీసీసీ సభ్యులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీ విజయరామరావు, మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌రెడ్డి, కొండేటి శ్రీ్ధర్, బక్క జడ్సన్, పాల్గొన్నారు.

చిత్రాలు..వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట బహిరంగ సభలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి,
* హాజరైన ప్రజలు