తెలంగాణ

ప్రజాధనం లూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మే 19: రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోందని, ఈ నాలుగేళ్ల కాలంలో రూ. ఐదు లక్షల కోట్ల బడ్జెట్‌లో ప్రజలకు ఇప్పటికీ ఎలాంటి సత్ఫలితాలు అందలేదని తెలంగాణ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ ఈ నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం ఐదు లక్షల కోట్లతో బడ్జెట్ అమలుచేసినప్పటికి, ప్రజలకు ఓరింగిదేమిలేదన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేసి తామే సాగునీటిని అందించామని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధియే నేటికి గ్రామాలలో కనిపిస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో పాలన కొనసాగిస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పార్టీలో పదవులు పొందిన కొంతమంది వెళ్లిపోయారేగాని, కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతున్నారని, టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు. గ్రామస్థాయి నుంచి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని, రాబోయే రోజులలో వారికి పోటీ చేసే అవకాశాలను కల్పిస్తామని ఆయన ప్రకటించారు. గతంలో టీడీపీ పాలననను, ఇప్పటి పాలనను ప్రజలకు వివరించి టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజలకు వివరించి చైతన్యపర్చాలన్నారు. కార్యకర్తలంతా సైనికుల్లా పని చేసి టీడీపీకి పూర్వవైభవం తీసుకొని రావాలన్నారు. కార్యకర్తలంతా కలిసకట్టుగా పనిచేస్తే 2019 ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదుగురి ద్వారానే పాలన కొనసాగుతుందని, ప్రజాధానాన్ని బహిరంగంగా లూటీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్‌రావుతోపాటు కొత్తగా ఎంపీ సంతోష్‌కుమార్ ఈ జట్టులో కలిసి పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మోపతయ్య, డాక్టర్ పగిడాల శ్రీనివాసులు, కొప్పుల రమేష్, యాదగిరితోపాటు నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిధిలోని నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.