తెలంగాణ

ప్రజలకు ఇక మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన రీతిలో పరిపాలనను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార వికేంద్రీకరణ కోసం కొత్తజిల్లాలను ఏర్పాటుచేసి సుపరిపాలనను అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్దిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటుచేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలన్న ఆలోచనతో కొత్తజిల్లాలను ఏర్పాటుచేసి ప్రజలకు సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో గత 70, 80 ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల ప్రక్షాళనను చేపట్టి విజయవంతంగా పూర్తిచేశామన్నారు. భూరికార్డులు సక్రమంగా లేకపోవడంతో దశాబ్దాలుగా గ్రామాల్లో అనేక వివాదాలు, ఘర్షణలు, హత్యలకు కారణమయ్యాయన్నారు. భూరికార్డుల ప్రక్షాళన ద్వారా నిజమైన లబ్ధిదారులు, యాజమాన్య హక్కులు పొందినవారిని గుర్తించామన్నారు. కొత్తగా ధరణి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి సమగ్ర భూముల వివరాలను అందులో నమోదు చేసి ఇకపై భూ మార్పిడిలో అక్రమాలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల ముంగిటకే పరిపాలనను తీసుకువెళ్లే ఆలోచనలో భాగంగా తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు చేపడుతున్నామన్నారు. మండలకేంద్రాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటుచేయడం వల్ల రైతులు, ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. కొత్తవిధానం ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయబడతాయని భూములు విక్రయించిన వారి పాస్‌పుస్తకాల నుండి తొలగించబడతాయన్నారు.
జిల్లాలో గతంలో మూడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలే ఉండేవని ఈవిధానం అమలు వల్ల కొత్తగా 20 తహశీల్దార్ కార్యాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్చడం వల్ల రైతులు, ప్రజలకు సౌలభ్యగం ఉంటుందన్నారు. అదేవిధంగా కొత్తగా తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు అందుబాటులోకి తీసుకురానున్నందున సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డాక్యూమెంట్ రైటర్ల ఉపాధికి భంగం కలగకుండా ప్రభుత్వం వారికి తగిన న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ డి.సంజీవరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చిత్రం..చివ్వెంలలో రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి