తెలంగాణ

ఎస్‌ఎల్‌బీసీకి శ్రీకారం చుట్టింది మేమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, మే 24: అన్ని రంగాల అభివృద్ధికి నీరే ముఖ్యమని గుర్తించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి కృషిచేసినట్లు సీఎల్పీ నేత, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరి జానారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన నల్లగొండ జిల్లాతో పాటు లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరందించాలనే ఉద్దేశంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు నచ్చజెప్పి ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తదనంతరం రైతుల ప్రయోజనాల కోసం ప్రతి ఎకరాకు నీరందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మించిందని పేర్కొన్నారు. అక్కడా.. ఇక్కడా అనే భేదం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఏకెబీఆర్ నుండి 7బి డిస్ట్రిబ్యూటర్ (హైలెవెల్ కెనాల్) నిర్మింపజేసి పీఏపల్లి మండలంతో పాటు గుర్రంపోడ్ మండలంలోని వేల ఎకరాలకు సాగునీరందించేలా హైలెవెల్ కెనాల్ ద్వారా వచ్చే సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందన్నారు. అనంతరం ద్విచక్రవాహనంపై వెళ్లి గుడిపల్లి చెరువును పరిశీలించారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్‌లాల్ నాయక్ పాల్గొన్నారు.

చిత్రం.. గుడిపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జానారెడ్డి