తెలంగాణ

రోజురోజుకూ తగ్గిపోతున్న సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, మే 23: శ్రీశైలం జలాశయం నుండి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. సోమవారం సాయంత్రానికి సాగర్ నీటిమట్టం 507.20 అడుగులకు చేరుకుంది. ఇది 126.9612 టిఎంసీలకు సమానం. జంట నగరాల వాసులకు మంచినీటి అవసరాల కోసం సాగర్ జలాశయం నుండి 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 775 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 18.5410 టిఎంసీలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి సరఫరా నిలిచిపోయినట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.