తెలంగాణ

పాలమూరు ప్రాజెక్టుపై.. కేసులు, ధర్నాలు సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 12: పాలమూరు ఎత్తిపోతల పథకంపై కేసులు వేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకుని అడ్డంకులు సృష్టించిన వారే తిరిగి ధర్నాలకు దిగడం సిగ్గుచేటని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మూసాపేటలో జరిగిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకం పరిధిలోని కర్వెన రిజర్వాయర్ దగ్గర కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగడం సిగ్గుచేటన్నారు. కర్వెన రిజర్వాయర్ ముంపు బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా భూపరిహారంతో పాటు పలు సౌకర్యాలను అందజేయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ నాయకులు తమ ఉనికి కోసం ఓ 50 మందిని వెంటబెట్టుకుని రాజకీయ డ్రామాకు తెరలేపుతూ ధర్నా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పిన రాజకీయంగా సమాధి చేసిన ఇంకా జ్ఞానోదయం కలుగకపోతే వారంత పిచ్చివారు మరోకరు ఉండరని ఎద్దెవా చేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే ప్రజలు తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామన్నారు.
కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుల పేరిట అవినీతికి పాల్పడి సాగునీరు ఇవ్వలేదని టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే కల్వకుర్తి, భీమ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు దక్కిందన్నారు. రాత్రింబవళ్లు అనకుండా ప్రాజెక్టుల దగ్గరే తిష్టవేసి పనులు వేగవంతం చేయించి బీడుబారిన పాలమూరు పొలాల్లో కృష్ణాజలాలను అందించామని లక్ష్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన శాస్తి మళ్లీ ఓసారి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.