తెలంగాణ

ముస్లింలను మోసగించిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, జూన్ 12: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు దాటినా ఇవ్వకుండా మోసగించారని స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని షాదీఖానాలో పత్రికల వారితో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ముస్లింలను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు. బుధవారం స్థానిక షాదీఖానాలో హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రముఖ ముస్ల్లిలంకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి రావాలని అన్నారు. తెలంగాణలో ముస్లింలు, క్రెస్తవులు గమనించారని మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకుని రాష్టప్రతి ఎన్నికలలో ఆర్‌ఎస్‌ఎస్ అభ్యర్థి ఎన్‌డిఏ నిలబెట్టగా కాంగ్రెస్‌కు చెందిన మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను నిలబెట్టగా టీఆర్‌ఎస్, కేసీఆర్ బీజేపి అభ్యర్థికే మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఉప రాష్టప్రతి ఎన్నికలలో ఎన్‌డీఏ వెంకయ్యనాయుడును నిలబెట్టగా మహాత్మా గాంధీ మనుమడు గోపాల్ గాంధీని కాంగ్రెస్ నిలబెట్టగా కేసీఆర్ బిజెపి అభ్యర్థికే మద్దతు ఇచ్చారని అన్నారు. మోదీ పెద్ద నోట్లు రద్దు చేయించగా సామాన్యులు, చిన్న వ్యాపారులు, ప్రజలు అగచాట్లు ఇబ్బందులు పడినా కేసీఆర్ మోదీకే మద్దతు ఇచ్చారని అన్నారు. అనేక లోపాలు ఉన్న జీయస్‌టీ బిల్లు నరేంద్రమోడీ తీసుకరాగా కేసీఆర్ బేషరతుగా మద్దతు ఇచ్చారని తెలంగాణ రాష్ట్రానికి రావలసిన బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపేట రైల్వే కోచ్ కర్మాగారం తదితర అంశాలపై కేసీఆర్ నోరు మెదపడం లేదని అన్నారు.
నరేంద్ర మోదీతో కేసీఆర్, ఒవైసీల రహస్య ఒప్పందం
రాష్టప్రతి ఎన్నికలలో కేసీఆర్ మద్దతు పలికిన రాష్టప్రతి రామ్‌నాద్ కోవింద్ ముస్లింలకు రంజాన్ ఇఫ్తార్ విందు నిలిపివేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉత్తర భారతంలోనూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలో మైనార్టీలకు రక్షణ కరువైనదని మక్కా మసీదు పేలుళ్లలో నిందితులపై ఎన్‌ఏఐ కనీసం అప్పీలు కూడా చేయలేదని అన్నారు. ఆలేరు ఎన్‌కౌంటర్‌లో నలుగురు ముస్ల్లింలు బలైతే కేసీఆర్ కనీసం ఖండన కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్, ఓవైసీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రహస్య ఒప్పందం చేసుకున్నారని ఇది ప్రజలు గమనిస్తున్నారని ఉతమ్ అన్నారు. తెలంగాణలోని మైనార్టీలు కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌కు బీజేపీతో ఉన్న ఒప్పందం గమనించారని అన్నారు. నేడు ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, వక్ప్‌బోర్డు చైర్మన్ కూదూ పాషా, మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్ రానున్నారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు పాల్గొన్నారు.
చిత్రం..హుజూర్‌నగర్‌లోని షాదీఖానాలో చిత్రం..మాట్లాడుతున్న పీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి