తెలంగాణ

బాలాలయ నిర్మాణం 31నాటికి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 23: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని బాలాలయ నిర్మాణం నిర్ధేశించిన గడువు ప్రకారం ఈ నెల 31వరకు పూర్తి చేస్తామని టెంపుల్ డెవలప్‌మెంటు అధారిటీ (వైటిడిఎ) వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. సోమవారం ఆయన యాదాద్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం ఆలయ పరిసరాలను, బాలాలయ పనుల పురోగతి, క్యూకాంప్లెక్స్ నిర్మాణ స్థలం, నూతనంగా నిర్మించే సత్యనారాయణస్వామి వ్రత మండప స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఇక మీదట వర్షం వచ్చినా ఆలయంలోకి నీళ్లు రాకండా తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రెండవ దశ కూల్చివేత పనులు వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. రెండవ దశ కూల్చివేతలు పూర్తి కాగానే ప్రధాన ఆలయ నిర్మాణ పనులు మొదలు పెడతామని చెప్పారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార్లకు సూచించారు.

చిత్రం బాలాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న వైటిడిఎ అధికారులు