తెలంగాణ

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 12: విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నదని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన జూనియర్ కళాశాల నూతన భవనాన్ని కడియం శ్రీహరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లల్లో 573 ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామని, అలాగే, 53 డీగ్రీ కళాశాలను ప్రారంభించామని, 187 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసామని అన్నారు. రాష్ట్రంలో 4.50లక్షల మంది గురుకుల పాఠశాలల్లో చదువుతున్నారని వివరించారు.