తెలంగాణ

కొత్త జిల్లాలకు అడ్డుపడటం అజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: పరిపాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలను త్వరితగతిన అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు అడ్డుపడటం కాంగ్రెస్, టిడిపిల అజ్ఞానానికి నిదర్శనమని టిఆర్‌ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. కొత్త జిల్లాల ఏర్పాటుపట్ల తమకున్న అభ్యంతరం ఏమిటో చెప్పకుండా గుడ్డిగా వ్యతిరేకిస్తే కుదరదని టిఆర్‌ఎస్ విమర్శించింది. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, కొత్త జిల్లాలు ఏర్పడి అభివృద్ధి చెందితే టిఆర్‌ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్, టిడిపిలు విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో పదో జిల్లాగా రంగారెడ్డి జిల్లా ఏర్పడే నాటికి 2.50 కోట్లు ఉన్న తెలంగాణ ప్రాంత జనాభా ప్రస్తుతం 4 కోట్లకు చేరుకుందని, పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాలు, మండలాలు, నియోజకవర్గాలు పెరగాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో చివరి మండలం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం వంద నుంచి 150 కిలో మీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వారు వివరించారు. చెన్నూరు నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 150 కిలోమీటర్లు, నల్లగొండ జిల్లాల్లో ఆలేరు మండలంలోని చివరి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి 125 కిలో మీటర్లు, అచ్చంపేట నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 130 కిలో మీటర్లు, మెదక్ జిల్లాలో నంగునూర్ నుంచి సంగారెడ్డికి 120 కిలో మీటర్లు, మద్దూరు నుంచి నిజామాబాద్ జిల్లాకు 100 కిలో మీటర్లు, కాళేశ్వరం నుంచి కరీంనగర్‌కు 100 కిలో మీటర్లు వెళ్లాల్సి ఉందని వారు వివరించారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదనే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాలు చేర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.