తెలంగాణ

సీపెట్‌లో పీజీ, డిప్లొమాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: కేంద్రప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమో, పోస్టు డిప్లొమో, పోస్టు గ్రాడ్యూయేట్ డిప్లొమో కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. 3 ఏళ్ల డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, మూడేళ్ల డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ వౌల్డ్ టెక్నాలజీ, సంవత్సరం ఆరు మాసాలు కొనసాగే పోస్టు డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ వౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్ క్యామ్ , పోస్టు డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీపెట్‌లో చదువు పూర్తికాగానే దేశ విదేశాల్లో ప్లాస్టిక్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ వరకూ పంపించుకోవచ్చని, వివరాలకు సీపెట్ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు.