తెలంగాణ

26 దేవాలయాలకు పాలక మండళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: రాష్ట్రంలోని 26 ప్రధాన దేవాలయాలకు నాన్-హెరిడిటీ పాలక మండళ్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాలక మండళ్లలో సభ్యులుగా ఎంపిక చేసేందుకు వీలుగా భక్తులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శివశంకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక జీఓ జారీ అయింది. ఖమ్మం జిల్లాలోని గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కాల్వఒడ్డులోని సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి ఆలయం, కమాన్ బజార్‌లోని వేంకటేశ్వరస్వామి ఆల యం, రెడ్డిపల్లి గ్రామంలోని మారెమ్మ ఆలయం, జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వివేకనగర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, ఎస్‌పీ రోడ్డులోని వీరహనుమాన్ ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ పోచమ్మ ఆల యం, మహంకాళి వీధిలోని ఉజ్జయినీ మహంకాళి ఆలయం, శ్రీనగర్‌కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, అమీర్‌పేటలోని కనకదుర్గ ఆలయం, సిద్ధిపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, నాచారం గుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆల యం, సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయాల కు పాలక మండళ్లను నియమిస్తున్నారు.