తెలంగాణ

తప్పుల తడక దోస్త్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆన్‌లైన్ ప్రక్రియ ‘దోస్త్’ తప్పుల తడకగా మారిందని గుర్తింపు పొందిన డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు జి రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి టి విజయభాస్కరరెడ్డి, సలహాదారు బైరెడ్డి లక్ష్మారెడ్డిలు ఆరోపించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలిలో దోస్త్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో వందలాది మంది విద్యార్థులు అనునిత్యం దోస్త్ కన్వీనర్‌ను కలిసి తమ ఆప్షన్లను మార్చుకునే వీలు కల్పించాలని కోరుతున్నారని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో తాము చేరబోమని, ప్రైవేటు కాలేజీల్లో చేరుతామని వారు చెబుతున్నారని కారణం ప్రభుత్వ కాలేజీల్లో సరిపడా సిబ్బంది, వౌలిక సదుపాయాలు లేకపోవడమేనని వారు వివరించారు. అడ్మిషన్లలో రోస్టర్ విధా నం ఉల్లంఘించారని, ఆట మధ్యలో రూల్స్ మార్చినట్టు దోస్త్ రెండో దశకు వచ్చేసరికి అకస్మాత్తుగా నిబంధనలు మార్చారని, దొడ్డిదారిన స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు.
గుర్తింపు లేని కాలేజీలను నిలిపివేయాలి
గుర్తింపు లేని కాలేజీల్లో అడ్మిషన్లకు అవకాశం ఇవ్వవద్దని, వాటిని నిలిపివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం తిరుపతి, కోట రమేష్‌లు కోరారు.