తెలంగాణ

స్ర్తినిధి సభ్యులకు ‘ట్యాబ్లెట్ పీసీ’ లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: రాష్ట్రంలోని స్వయం సహా య గ్రూపులకు ట్యాబ్లెట్ పీసీలను (పర్సనల్ కంప్యూటర్) అందిస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్ర్తి నిధి బ్యాంకు సహకారంతో 25 సంఘాలకు లాంఛనంగా ట్యాబ్లెట్ పీసీలను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ట్యాబ్లెట్ పీసీలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్కో స్వయం సహాయ గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) కు ఒక ట్యాబ్లెట్ పీసీ ఇస్తున్నారు. దీని ధర 14,856 రూపాయలు. ఈ డబ్బును స్ర్తినిధి బ్యాంకు రుణంగా ఎస్‌హెచ్‌జీలకు ఇస్తోంది. ఈ రుణాన్ని సంబంధిత ఎస్‌హెచ్‌జీ 36 నెలల్లో నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని కృష్టారావు తెలిపారు. ఎస్‌హెచ్‌జీలు తమ పరిపాలనా వ్యవహారాలన్నింటికీ ఈ ట్యాబ్‌లెట్లను వినియోగించుకోవచ్చన్నారు. అయితే వ్యక్తిగత సమాచారాన్ని ట్యాబ్లెట్‌లో పొందుపరిచేందుకు వీలులేదన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ స్ర్తినిధి బ్యాంకు నడుస్తోందని జూపల్లి తెలిపారు. ఇప్పటికే ఆరువేల కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణంగా ఈ బ్యాంక్ అందచేసిందన్నారు. మహిళల ఆర్థిక ప్రగతికి, పురోగతికి ఈ బ్యాంక్ పాటుపడుతోందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ పాల్గొన్నారు.