తెలంగాణ

డీడీలు కట్టవద్దని డీలర్ల నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: కమిషన్ పెంచాలి, ఉద్యోగులుగా పరిగణించాలి, బకాయిలు చెల్లించాలన్న తదితర ప్రధాన డిమాండ్లతో నిరవధిక సమ్మెకు నోటిసు ఇచ్చిన రేషన్ షాపుల డీలర్లు ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వచ్చే నెల నుంచి రాష్టవ్య్రాప్తంగా రేషన్ షాపులు మూత పడటం ఖాయంగా కనిపిస్తోంది. డీలర్ల సమ్మెకు హమాలీల సంఘీభావం కూడా తోడుకావడంతో రేషన్ షాపుల ఆందోళన చేయి దాటే పరిస్థితి ఏర్పడింది. జూన్ నెలలో చేసే సరుకుల శుక్రవారం అర్ధరాత్రితో జిల్లాల్లో ముగిసిపోనుంది. జిహెచ్‌ఎంసి పరిధిలో మాత్రమే ఈ నెల 20న అర్దరాత్రి వరకు పంపిణీకి గడువు ఉంది. జిల్లాల్లో పంపిణీకి గడువు ముగిసిన మరుసటి రోజు ఈ నెల 16 నుంచే జూలైలో పంపిణీకి సంబంధించిన సరుకులకు డిమాం డ్ డ్రాఫ్ట్‌లను అందజేసి బియ్యం, కిరోసిన్‌ను డ్రా చేసుకోవాల్సి ఉంది. అయితే వచ్చే నెల నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వానికి డిడిలు కట్టకూడదని డీలర్లు పట్టుదలతో ఉన్నారు. వచ్చే నెల సరుకుల కోసం డిడిలు తీయడం లేదని పౌర సరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌కు డీలర్ల సంఘం తెగేసి చెప్పేసింది. పరిస్థితి చెయి దాటిపోయే ప్రమాదం ఉండటంతో చర్చలకు రావాల్సిందిగా కమిషనర్ పిలుపునిచ్చినప్పటికీ డీలర్ల నుంచి స్పందన లేదు. పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడాన్ని సామాజిక సేవగా భావించాలని. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని కమిషనర్ అకున్ సబర్వాల్ పిలుపునిచ్చారు. గతంలో మంత్రి ఈటెల స్వయంగా చర్చలకు పిలిచి ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేనప్పుడు కమిషనర్ ఇచ్చే హామీని ఎలా నమ్ముతామని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో రేషన్ షాపులు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది.