తెలంగాణ

లాసెట్ ఫలితాల్లో 15793 మందికి అర్హత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణలోని న్యాయవిద్యా కళాశాల్లో చేరేందుకు నిర్వహించిన లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, లా సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ బి ద్వారకానాధ్ విడుదల చేశారు. 3 ఏళ్ల లాకోర్సునకు 16332 మంది రిజిస్టర్ చేసుకోగా, 12960 మంది హాజరయ్యారని వారిలో 11563 మంది అర్హత సాధించారని, అదే విధంగా ఐదేళ్ల లా కోర్సుకు 4580 మంది రిజిస్టర్ చేసుకోగా, 3727 మంది హాజరయ్యారని, వారిలో 2401 మంది అర్హత సాధించారని, పీజీలాసెట్‌కు 2197 మంది రిజిస్టర్ చేసుకోగా, 1860 మంది హాజరయ్యారని, 1829 మంది అర్హత సాధించారని, మూడు కోర్సులకు కలిపి 23109 మంది రిజిస్టర్ చేసుకోగా, 18547 మంది హాజరయ్యారని, అందులో 15793 మంది అర్హత సాధించారని చెప్పారు. ఈసారి లాసెట్‌కు నలుగురు ట్రాన్స్ జండర్లు పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, అందులో ఇద్దరు అర్హత సాధించారని చెప్పారు. అర్హులైన వారిలో ఒయు పరిధిలో 14570 మంది కాగా, ఎయు పరిధిలోని వారు 409 మంది, ఎస్వీయు పరిధిలోని వారు 268 మంది ఉన్నారని వివరించారు. అర్హులైన వారిలో ప్రత్యేక సామర్ధ్యాలున్న వారు 128 మంది ఉన్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలో 21 కాలేజీల్లో 3 ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, మరో 18 ప్రైవేటు ఆధీనంలో ఉన్నాయని అందులో 3 ఏళ్ల కోర్సులో 2702, ఐదేళ్ల కోర్సులో 1064, ఎల్‌ఎల్‌ఎంలో 556 సీట్లు ఉన్నాయని, మూడు విభాగాల్లో కలిపి ఈ ఏడాది 4710 సీట్లకు పెంచామని చెప్పారు.
టాపర్లు వీరే
3 ఏళ్ల కోర్సులో తొలి మూడు ర్యాంకులు జె ఆదిత్య, ఆర్ రాజకుమార్, జె విజయకుమార్, ఐదేళ్ల కోర్సులో ఎస్ యశ్వంత్, ఎస్ విష్ణు అమేయ, కే అజయ్ క్రాంతి, ఎల్‌ఎల్‌ఎం కోర్సు లో వి గాయత్రి, పి మానసరెడ్డి, ఎస్ సతీష్‌రెడ్డిలు మూడు ర్యాంకులు సాధించారు.