తెలంగాణ

అగ్ర నేతలతో ఉత్తమ్ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమర్‌కుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో చర్చలు జరిపారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో వివిధ పదవుల భర్తీకి సంబంధించి ఆయన అగ్రనాయకులతో మాట్లాడారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఆర్‌సి కుంతియా, ఇతర పార్టీ నేతలతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు.
ముఖ్యంగా ప్రచార కమిటీ చైర్మన్ పదవితో పాటు టీపీసీసీలు, కార్యవర్గ సభ్యుల పదవుల కేటాయింపుపై చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యాచరణ, పార్టీ పదవుల కేటాయింపు తదితర అంశాలు చర్చించారు.