తెలంగాణ

రంజాన్ పండుగకు భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: పవిత్ర రం జాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా అన్ని మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించేందుకు వీలుగా ట్రాఫిక్‌ను పలు చోట్ల మళ్లించినట్లు తెలిపారు.
రంజాన్ సందర్భంగా ఆఖరి శుక్రవారం రోజు పాతబస్తీతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ప్రార్ధనలు ప్రశాంతంగా జరిగాయని వివరించారు. శనివారం రంజాన్ రోజున శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా 50 సమస్యాత్మక మందిరాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాతబస్తీతో పాటు సమస్యాత్మకంగా ఉండే ప్రాంతాల్లో భద్రత కోసం ఐదు వేల మంది పోలీసులను మోహరింప చేస్తున్నట్లు తెలిపారు. పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగా పలు భద్రత చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నగరం మొత్తం మీద 600 మసీదుల వద్ద నిఘాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలైన మాదన్నపేట, మక్కామసీదు, మీరాలం దర్గా, మరికొన్ని ప్రధాన మసీదుల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు
కాగా రంజాన్ పండుగను పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు సిపి అంజనీకుమార్ చెప్పా రు. 16వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 వరకు పలు చోట్ల వన్‌వే ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి మీరాలం ట్యాంక్ ఈద్గా వైపునకు ప్రార్ధనలకు వచ్చే వారిని బహదూర్‌పురా క్రాస్ రోడ్ గుండా అనుమతిస్తారని తెలిపారు. ఈ రూట్లో వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను బహదూర్‌పురా క్రాస్ రోడ్ నుంచి కిషన్‌బాగ్, కామాటిపురా, పురానాపూల్ మీదుగా మళ్లిస్తారు. జూపార్క్‌లోపల ఇటుగా వచ్చే వారికి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కాగా శివరాంపల్లి, దానమ్మ హట్స్ వైపు నుంచి ఈద్గా వైపునకు ప్రార్ధనల కోసం వచ్చే వారిని దానమ్మ హట్స్ మీదుగా అనుమతిస్తారు.
దానమ్మ హట్స్ క్రాస్ రోడ్ నుంచి శాస్ర్తిపురం, ఎన్‌ఎస్ కుంట వైపునకు మళ్లిస్తారు. ఇటువైపు వచ్చి ప్రార్ధనల్లో పాల్గొనే వారికి యూసఫ్, మజార్, జయేష్ పార్కింగ్ ప్రాంతాలు, ఈద్గా వద్ద ఉన్న మోడరన్ సామిల్లులో, మీరాలం ఫిల్టర్ బెడ్, యాదవ్ పార్కింగ్‌లలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చును. అలాగే కాలాపత్తర్ వైపు నుంచి ఈద్గా వరకు ప్రార్ధనల కోసం వచ్చే వారిని అనుమతిస్తారని, సాధారణ ట్రాఫిక్‌ను కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి మోచి కాలనీ, బహదూర్‌పురా, శంషేర్‌గంజ్, ఎన్‌కె కుంట మీదుగా మళ్లిస్తారు.