తెలంగాణ

21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో 9 జిల్లా ల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు అం దుబాటులో ఉన్నందున, హైదరాబాద్ మినహా మరో 21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను ఈ ఏడాదే ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూలు, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డిలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మం చిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, భువనగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వా ల్, వికారాబాద్, మేడ్చెల్ జిల్లాల్లో కొత్తగా జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించాల్సి ఉంది. వీటికి అవసరమైన స్థలాన్ని, ఇతర వౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వ అనుమతి రావల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటి, వరంగల్ లేదా హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కూడా ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్రమోదీని కోరారు. వీటితో పాటు గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు, మరో వెటర్నరీ యూనివర్శిటీ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కేంద్రం నుండి సానుకూలత లభిస్తే ఈ ఏడాది నుండే వాటిని ప్రారంభించి అడ్మిషన్లు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అవసరమైతే సమీపంలోని ప్రభు త్వ హైస్కూళ్లలో తాత్కాలిక వస తి సౌకర్యం కల్పించి వాటిని నిర్వహిస్తారు. 2014 జూన్ 26 నుండి ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చక్కర్లు కొడుతోంది.