తెలంగాణ

సౌర విద్యుత్ కోసం సింగరేణి పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సౌర విద్యుత్‌ను ఉత్తత్తి చేయడానకి సింగరేణి సంస్థ పరుగులు తీస్తోంది. మొదటి దశలో 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్తత్తిని చేయడానకి సన్నాహాలు చేస్తోంది. సింగరేణికి అనుబంధంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ఉత్తత్తి చేయడానకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (ఇండియా)తో చర్చలు జరిపారు. సౌర విద్యుత్ కోసం దేశ వ్యాప్తంగా నిర్మాణదారుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియను మరో వారం రోజుల్లో పూర్తి చేయడానికి విధివిధానాలను సింగరేణి సంస్థ రూపొందిస్తోంది. ఆర్థిక వనరుల కోసం సౌర విద్యుత్‌ను అడ్డాగా మార్చుకోవాలని సింగరేణి యాజమాన్యం యోచిస్తోంది. రానున్న రోజు ల్లో తెలంగాణలో భారీ స్థాయిలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ అసరాలు గణనీయంగా పెరగనున్నాయి. మంచిర్యాల జైపూర్ వద్ద ఇప్పటికే సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్లు విద్యుత్‌ను ఉత్తత్తి చేస్తూ, ప్రభుత్వానికి విక్రయిస్తోంది.రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన బొగ్గు గనుల సమీపంలో ఖాళీ ఉన్న ప్రదేశాలను సౌర విద్యుత్ కోసం సింగరేణి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సౌర విద్యు త్ కేంద్రాల నిర్మాణాలు తక్కవ సమయంలో పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉన్నందున సింగరేణి అటువైపు దృష్టిసారిస్తోంది. ఒక్కో మెగావాట్ సౌరవిద్యుత్ ఉత్తత్తి చేయడానకి కనీసం 5ఏకరాల భూ విస్తీర్ణం అవసరం ఉంటుంది. మొదటి దశలో నాలుగు ఏరియాలను గుర్తించారు. ఇల్లందులో 60 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం 300 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. అలాగే రామగుండంలో-3లో 50 మెగావాట్ల కోసం 250 ఎకారాలు, మణుగూరులో 30 మెగావాట్ల కోసం 150 ఎకరాలు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద 10 మెగావాట్ల కోసం 50 ఎకారాలు భూమిని సౌర విద్యుత్ కోసం కేటాయించారు. మరో యేడాదిలో సౌర విద్యుత్ ఉత్తత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. సౌర విద్యుత్ యూనిట్ ధరలు ఎక్కవగా ఉంటాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ అవసరాల కోసం వివిధ మార్గాలను అనే్వషిస్తోంది. సౌర విద్యు త్ ఉత్తత్తి కోసం కేంద్రం రాయితీలను ప్రకటిస్తోంది. కేంద్ర సహాయాన్ని ఏమేరకు సింగరేణి వినియోగించుకుంటుందో వేచి చూడాల్సిందే.