తెలంగాణ

చిట్‌ఫండ్ కంపెనీల దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వంటి సంస్థలతో పాటు తెలంగాణలో కనకదుర్గ చిట్ ఫండ్, భవిత శ్రీ చిట్‌ఫండ్ తదితర సంస్థలు సామాన్యులను దోచుకుని బోర్డులు తిప్పేశాయని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కిక్కురుమనడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన పాత్రికేయులతోమాట్లాడుతూ చిట్‌ఫండ్ సంస్థలకు సహకరిస్తున్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. చిట్ ప్రారంభమైన మొదటి పది నెల ల కాలంలో కొన్ని చిట్ కంపెనీలు ఒకటి లేదా రెండు నెలల చిట్‌లను ఏకపక్షంగా ఎటువంటి బిడ్ నిర్వహించకుండానే కంపెనీల పేరుమీద ఎటువంటి జమానతు లేకుండానే తీసుకుంటున్నాయని, అటువంటి చిట్ కంపెనీలపై చర్యలు తీసుకుని ప్రతి నెల బిడ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిట్ తీసుకున్న తర్వాత బలవంతంగా ఇన్స్యూరెన్స్ చేయించుకునే కంపెనీలపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.