తెలంగాణ

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రం లో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రజలకు సరుకులు సక్రమంగా అందేలా చూడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల ఆందోళనలతో వచ్చే నెల చౌక దుకాణాలు పనిచేయక లక్షలాది మంది పేదలకు సరుకులు అందని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రేషన్‌షాపుల్లో అవినీతి జరుగుతోందని ప్రభుత్వం ఈ పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. మొట్టమొదట రాష్టర్రాజధానిలోని 1662 ఫాపుల్లో ప్రవేశపెట్టి, అనంతరం రాష్టవ్య్రాప్తంగా ఉన్న 17వేల షాపుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. దీంతో షాపుల్లో జరిగే అవినీతిని పూర్తిగా అరికట్టినట్టు ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తుచేశారు. ఇందుకు గాను డీలర్లకు ప్రోత్సాహంగా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.70లు చెల్లించాలని, ఇందులో రూ. 35 రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 35 కేంద్రం చెల్లించాలని నిర్ణయించారు. కాగా కేంద్రం రూ.200 కోట్లు నిధులు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడంతో డీలర్లకు రూ.400 కోట్ల మేర బకాయిలు పడింది.