తెలంగాణ

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: పాతబస్తీలో నాలుగు వోల్వా బస్సులు, రెండు లారీలు అగ్నికి ఆహుతయ్యాయి. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. రంజాన్ పండుగ వాతావరణంలో ఆ ప్రాంత వాసులు ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు. మరో వైపు అగ్నిప్రమాదం సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు. ఇం దుకు సంబంధించి నగర దక్షిణ మం డల డిసిపి సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్‌బన్ ప్రాంతంలో పార్కింగ్‌లో ఉంచి న నాలుగు ఏసి వోల్వా బస్సు లు, రెండు లారీలు ఆకస్మికంగా అగ్నిప్రమాదానికి గురై కాలిపోయాయి. మూడు ఫైరింజన్లు ఏకధాటిగా మంటలను ఆర్పేందుకు రంగంలో దిగా యి. సంఘటన ప్రాంతానికి స్ధానిక పోలీసులు, పాతబస్తీలో భద్రతకు ఉన్న ప్రత్యేక పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీస్ క్లూస్ టీం బృం దాలు చేరుకుని ప్రమాదం జరగడానికి కారణాలను అనే్వషిస్తున్నారు. ఆ ప్రాంతంలో నిత్యం బెంగళూరు వైపునకు వెళ్లే ఏసి బస్సులు, సరుకు రవాణా చేసే లారీలు రోడ్డుపక్కన ఎప్పుడూ నిలిపి ఉంచుతారు. అక్కడ వాహనాల నుంచి వెలువడిన ఆయిల్ అక్కడక్కడ కింద పడ్డ కాగితాలు, బట్టలపై పడడంతో అటుగా వెళ్లే వారు ఎవరైనా సిగరెట్, బీడీ వంటివి కాల్చి పడవేయడంతో ఈ ప్రమా దం సంభవించి ఉం టుందని ప్రాధమికంగా అంచ నా వేసినట్లు డిసిపి తెలిపారు. అసాంఘిక శక్తుల పని కాదని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సులు పాతబస్తీకి చెందిన ఒమర్ ట్రావెల్స్‌విగా గుర్తించినట్లు చెప్పారు. ఒక వేళ ఇన్సూరెన్స్ కోసం వాహనాలను యజమానులు తగుల బెట్టారనే ఆరోపణలు రావడంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను వివిధ కోణా ల్లో విచారిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యక్ష సాక్ష్యులు మాత్రం ఒక్కసారిగా మం టలు చెలరేగడం చూశామని, కొంచెం కొంచెం అంటుకుంటే వెల్లడయ్యేదని అంటున్నారు.

చిత్రం..అగ్నిప్రమాదానికి గురైన బస్సులు