తెలంగాణ

మోదీది ప్రజారంజక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: నాలుగేళ్ల పాలనలో చిన్నపాటి అవినీతి ఆరోపణలు కూడా లేకుం డా ప్రధాని నరేంద్రమోదీ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారని, భారతీయుడి కీర్తి, ఔన్నత్యాలను ప్రపంచవ్యాప్తం చేస్తున్న ఘనత నరేంద్రమోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. తన ను కలిసిన పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా మేథావులతో అనేక సభలు నిర్వహించామని, వాటికి విశేష స్పందన వచ్చిందని చెప్పారు. నాలుగేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ విశిష్ట దృక్పథం వినూత్న పాలనతో వివిధ ప్రజారంజక కార్యక్రమాలు, ప్రజాసంక్షేమ పథకాలు చేపట్టి ప్రపంచంలోనే మేటి ప్రధానిగా పేరు గడించారని అన్నారు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కుటుంబ వారసత్వ అవినీతి పాలనతో అనేక కుంభకోణాలు, స్కాంలతో దేశాన్ని భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రధాని నరేంద్రమోదీ అనేక పథకాలు అమలుచేశారని చెప్పారు. ప్రజలకే పథకాలు చేరేలా 32 కోట్ల మంది పేదలకు జన్‌ధన్ యోజనలో భాగంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిపించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. దీంతో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడంతో పాటు వివిధ పథకాల ప్రయోజనాలను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్తున్నాయని అన్నారు. కేంద్రం అమలుచేస్తున్న 431 పథకాల ద్వారా 3,65,996 కోట్ల నగదు నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పారు.

చిత్రం..బీజేపీ నేత లక్ష్మణ్