తెలంగాణ

ఇక అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ కార్యక్రమాలతో పాటు భూ ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల అనేక కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మహానగర పాలక మండలి పరిధిలోని నియోజక వర్గాలు, జోనల్ పరిధిలో నిర్వహిస్తున్న ‘మన నగరం’ కార్యక్రమంతో స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు నడుం బిగించారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులు ప్రత్యేక తెలంగాణ సాధించిన వెంటనే ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా కేసీఆర్ తన హామీని నెరవేర్చేందుకు నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసుకున్న నివాసాల స్థలాలను క్రమబద్దీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణతో వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూర్చుకోవడంతో పాటు స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు జీఓ 58, 59లను జారీ చేశారు. దీంతో వందలాది మంది క్రమబద్దీకరణ కోసం ధరఖాస్తులు చేసుకున్నా కొన్ని సాంకేతిక కారణాలతో మరికొన్ని న్యాయపరమైన చిక్కులతో ధరఖాస్తులు పరిశీలించని రెవెన్యూ అధికారులు వారికి ఎటువంటి న్యాయం చేయలేక పోయారు. దీని కారణంగా అసైన్డ్ భూములు, చెరువు శిఖం భూములు, కోర్టు విచారణ కొనసాగుతున్న వివాదాస్పద భూములను క్రమబద్దీకరణ చేయక పోవడంతో వేలాది మంది నివాసాల ఏర్పర్చుకొని జీవనం కొనసాగిస్తున్న కేసీ ఆర్ సర్కార్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయామన్న ఆందోళనలో కొట్టిమిట్టాడుతున్నారు. జంటనగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న మన నగరం కార్యక్రమంలో కుప్పలు, తెప్పలుగా నివాస స్థలాల క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ చేయాలనే సమస్యలను ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులపై మంత్రి తీవ్రంగానే స్పందించారు. ఇటీవల నిర్వహించిన మన నగరం కార్యక్రమాల్లో వచ్చిన సమస్యలతో పాటు ఎల్బీనగర్ నియోజక వర్గం నాగోల్‌లో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో అత్యధిక శాతం వేల సంఖ్యలో క్రమబద్దీకరణ సమస్య ఉందని దృష్టికి రావడంతో వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉప్పల్ మండలం నాగోల్ రెవెన్యూ గ్రామంలో సర్వేనెంబర్ 101, 96, 87లలోని సుమారు 124 ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమంగా లేవుట్లు నిర్మించి భూములను విక్రయించడంతో వాటిని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారికి జీఓ 58, 59 ద్వారా ధరఖాస్తులు చేసుకున్నా క్రమబద్దీకరించక పోవడంతో సుమారు వెయ్యి కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌కు అభ్యర్ధించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం పీ ఓటి చట్టం ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ న్యాయపరమైన చిక్కులతో వాటిని క్రమబద్దీకరించలేక పోయామంటూ రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. అలాగే కోర్టు విచారణ కొనసాగుతున్న ఫత్తులగూడ సర్వేనెంబర్ 58లో సుమారు మూడు వేల మంది నిరుపేదలు ఇళ్లు నిర్మించుకొని ఉన్నప్పటికీ ధరఖాస్తు చేసుకున్న 600 మందికి జీఓ 58, 59ల ద్వారా క్రమబద్దీకరణ చేయలేదుంటూ ఫిర్యాదు చేశారు. అలాగే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ శాతం అసైన్డ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ వాటిని క్రమబద్దీకరణ చేయని కారణంగా ప్రభుత్వ ఖాజానకు ఆదాయవనరులు సమకూర్చుకోలేక పోగా, స్థానికులకు న్యాయం చేయలేదన్న ఆవేదనను ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో మంత్రి కేటీఆర్ ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు ప్రత్యేక చట్టం చేసి ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు వెయ్యి కోట్లపైగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్న నేపధ్యంలో అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో త్వరలో ఆందోళన చెందుతున్న నిరుపేదల బాధలు తీరనున్నాయి.
నగరంలో పేదల గుడిసెలు (ఫైల్ ఫొటో)