తెలంగాణ

చురుకుగా విద్యుత్ కేంద్రం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దామరచర్ల, మే 23: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మండలంలోని వీర్లపాలెం శివారులో ఈ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు ఆ ప్రాంతంలో మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ (టిఓఆర్) ఆమోదించడంతో జెన్‌కో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఈప్రాంతంలో భూములు కోల్పోతున్న 90 శాతం మంది రైతులకు ఇప్పటికే నష్టపరిహారం చెల్లింపులు చేపట్టగా కేవలం ఆక్రమిత భూములకు సంబంధించిన పరిహారం మాత్రమే అందించేది ఉందని అధికారులు తెలిపారు. విహెచ్‌ఇల్ అధికారులు యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టే ప్రాంతంలో జనరేటర్ల సహాయంతో డ్రిల్లింగ్ చేపట్టి మట్టి నమూనాలను ఎప్పటికప్పుడు భద్రపరుస్తున్నారు. సుమారు 4 వేల మెగావాట్ల థర్మల్ ఉత్పత్తికి జెన్‌కో సిద్ధంకాగా ఐదు ప్రాంతాల్లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల బాయిలర్స్‌ను నిర్మించనున్నారు. బాయిలర్స్‌ను నిర్మించే ప్రాంతంలో సుమారు 20 మీటర్ల లోతున మట్టిని, రాయిని వెలికి తీసి పరీక్షల నిమిత్తం ముంబై లాబోరేటరీకి తరలిస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సుమారు 5,558 ఎకరాలను సేకరించగా వీటిలో 4,676 ఎకరాలు అటవి భూమి ఉండగా మరో 842 ఎకరాలు పట్టా, హుడాక్, డీఫారెస్ట్ భూములు, అసైన్డ్భూములు ఉన్నాయి. ఈ భూములు కోల్పోతున్న రైతులకు 162 కోట్ల రూపాయలను నష్టపరిహారం కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈప్రాంతంలో థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టే ముందు ఈ ప్లాంట్ కింద మోదుగులతండా, కపూర్‌తండాలలో నివసిస్తున్న గ్రామస్థులను వేరేచోటకు తరలించనున్నారు. ఈ రెండు తండాలు పూర్తిగా పవర్‌ప్లాంట్ మధ్యలో ఉండడంతో పునరావాసం కింద వీరికి రూ.102.8 కోట్లను కేటాయించారు. ఈనెల చివరి వారంలో థర్మల్ పవర్‌ప్లాంట్‌పై ప్రజాభిప్రాద సేకరణ చేపట్టి పనులను మరింత వేగవంతం చేయాలని జెన్‌కో అధికారులు సన్నద్ధమవుతున్నారు.

చిత్రం థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణంతో ఖాళీకానున్న మోదుగులతండా